1. మత విశ్వాసం మీకు జవాబులివ్వదు,
ప్రశ్నలడగకుండా నోరు మూయిస్తుందంతే.
- రాంగోపాల్ వర్మ
2. ఎప్పుడూ రాజకీయ నాయకుల్ని విమర్శించే
సాధారణ పౌరుడు రాజకీయ నాయకుడు కాగలిగితే,
రాజకీయ నాయకులకంటే ఎక్కువగా దోచుకుంటాడు.
-రాంగోపాల్ వర్మ
3. నేనెప్పుడూ ఫ్లాపులు తీయలేదు...
అసలు సినిమా అనేది ఎలా తీయకూడదో అన్న విషయం
తెలుసుకునే క్రమంలో కూడా చాలాసార్లు సక్సెస్ అయ్యాను.
-రాంగోపాల్ వర్మ
4.చాలామంది పుట్టినరోజులు ఎందుకు జరుపుకుంటారంటే
365 రోజుల్లో కనీసం ఆ ఒక్కరోజన్నా కనీసం
కొంతమంది ముందైనా ఫేమస్సుగా ఫీలవ్వడం కోసం.
-రాంగోపాల్ వర్మ
5.ఇండియాలో వున్న అమెరికన్లకన్నా అమెరికా లో వుండే ఇండియన్సే ఎక్కువ.
దీన్ని బట్టి అర్ధమవుతున్నదేమిటంటే అమెరికన్స్ ఇండియాని ప్రేమిస్తున్న దానికంటే
ఇండియన్స్ అమెరికాని ఎక్కువ ప్రేమిస్తున్నారని.
-రాంగోపాల్ వర్మ
6.స్లో అండ్ స్టడీ అంటూ జీవితం మొత్తాన్ని వృధా చేసుకోవడంకంటే
స్పీడు పెంచి దెబ్బ తగిలించుకోవడం మంచిది. .
-రాంగోపాల్ వర్మ
7.భారతీయులు భారతదేశాన్ని ప్రేమిస్తారు.
కానీ భారతీయుల్ని ప్రేమించరు
-రాంగోపాల్ వర్మ
8.అన్నిటినీ దేవుడు సృష్టించుకుంటే దెయ్యాన్ని ఎందుకు సృష్టించినట్టు?
దేవుడు సృష్టించకపోయుంటే మరి ఎవరు సృష్టించినట్టు ?
-రాంగోపాల్ వర్మ
9. వాళ్లిద్దరూ ఎంతగానో ప్రేమించుకున్నారు.
కానీ తరువాత సంతోషంగా బతకలేకపోయారు...
కారణం పెళ్లి చేసుకున్నారు .
-రాంగోపాల్ వర్మ
10. ఒకే ఒక్క అమ్మాయిని ప్రేమించేకన్నా
మొత్తం స్త్రీ జాతిని ప్రేమించడం జ్ఞానవంతమైన పని
-రాంగోపాల్ వర్మ
11. నేను నాస్తికుడ్ని .
ఎందుకంటే నేను దైవాన్ని అర్ధం చేసుకున్నాను .
-రాంగోపాల్ వర్మ
12. టెర్రరిస్టులు ,దేవుళ్ళు అనే రెండు శక్తులు అమాయకులైన ప్రజల్ని
జాతి ,కుల ,మత ,ప్రాంత భేదాల్లేకుండా చంపుతారు
-రాంగోపాల్ వర్మ
13. నా నిశ్శబ్దాన్ని అర్ధం చేసుకోలేని వాళ్లకి
నా మాటలు అర్థంకావు .
-రాంగోపాల్ వర్మ
14.